TTD Board Members : టీటీడీ బోర్డు మెంబర్స్ పై కసరత్తు
ఫోకస్ పెట్టిన ఏపీ సీఎం జగన్ రెడ్డి
TTD Board Members : కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఏకైక ఆలయం తిరుమల. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. కలియుగ దైవంగా శ్రీవారిని భావిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే స్వామిని మొక్కులు తీర్చుకునేందుకు పోటీ పడతారు. లెక్కకు మించిన కానుకలు, విరాళాలు వస్తాయి. దేశం నలుమూలల నుంచి పుణ్య క్షేత్రానికి తరలి వస్తారు. దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో నిర్వహిస్తూ వస్తున్నారు. టీటీడీ పాలక మండలి పదవీ కాలం పూర్తయింది. దీంతో గతంలో ఉన్న చైర్మన్ సుబ్బారెడ్డిని తీసేసి తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు సీఎం జగన్ రెడ్డి.
TTD Board Members Confirmation Pending
ఇక మిగిలిన సభ్యులను నియమించాల్సి ఉంది. దీని కోసం పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. భారీ ఎత్తున ఆశావహులు టీటీడీ(TTD) బోర్డు సభ్యులు కావాలని కలలు కంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే వైసీపీ చీఫ్, సీఎం జగన్ రెడ్డి మనసులో ఏముందో ఎవరికీ అంతు బట్టడం లేదు.
ప్రత్యేకించి టీటీడీ బోర్డు సభ్యుడి పదవి అంటే మామూలు విషయం కాదు. దీనికి ప్రయారిటీ ఎక్కువగా ఉంటుంది. దర్శనం వెరీ స్పెషల్. సౌకర్యాలు కూడా అలాగే ఉంటాయి. ఇచ్చే లెటర్లకు ప్రాముఖ్యత ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే ప్రభుత్వ పరంగా గుర్తింపు ఉండడంతో దీని కోసం పోటీ ఎక్కువైంది. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారిని కూడా పరిగణలోకి తీసుకుంటారు. వీరితో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలకు ఛాన్స్ ఇవ్వనున్నారు.
Also Read : V Srinivas Goud : బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న