Eatala Rajender : బీజేపీ సీనియర్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్(Eatala Rajender) నిప్పులు చెరిగారు. శనివారం మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తామంటూ చేసిన కామెంట్స్ పై స్పందించారు. ఈ మేరకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సినిమా చూపించినా లేదా ట్రయల్ చూపించినా అసలు చూయించేది నాయకులు కాదు ప్రజలు అని గుర్తు పెట్టు కోవాలన్నారు ఈటల రాజేందర్.
Eatala Rajender Slams KTR
త్వరలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు అసలైన సినిమా చూడాల్సింది బీఆర్ఎస్ నాయకులన్నారు. జనం తప్పకుండా సీఎం కేసీఆర్ కు, ఆయన టీంకు తప్పకుండా చుక్కలు చూపిస్తారంటూ ఎద్దేవా చేశారు. ఏదైనా మాట్లాడేటప్పుడు ముందు వెనుకా చూసి మాట్లాడాలని సూచించారు. అడ్డదిడ్డంగా విపక్షాలపై రాళ్లు వేస్తామంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు ఈటల రాజేందర్.
ఇదిలా ఉండగా ఇదే బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు మురళీధర్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ దేశంలో ఎవరినైనా ఓడించడం చేతనవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో సీఎం కేసీఆర్ ను ఓడించడం తమ తరం కాదన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ తెలంగాణ బీజేపీని ఇరకాటంలో పడేశాయి. ఓ వైపు తామే ప్రత్యామ్నాయం అని బాకాలు ఊదుతున్న బీజేపీ లీడర్లకు ఈ కామెంట్స్ మింగుడు పడడం లేదు.
Also Read : DK Shiva Kumar : చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యత