Nara Lokesh : జగన్ పాలనలో మైనార్టీ ఆస్తులు కబ్జా
నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర 2,500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఆయన చేపట్టిన పాదయాత్ర ఆదివారం కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నారా లోకేష్(Nara Lokesh) కు భారీ ఎత్తున జనం సాదర స్వాగతం పలికారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఆయన దేనినీ వదిలి పెట్టడం లేదన్నారు. చివరకు కబ్రస్తాన్ లను కూడా కబ్జా చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు నారా లోకేష్.
Nara Lokesh Completed 2500km’s
రాష్ట్రంలో మైనార్టీలకు, వారి ఆస్తులకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైనార్టీల ఆస్తులు తప్పా సంక్షేమంపై శ్రద్ద ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ ను నిలదీశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని జన్నతుల్ భకీ ఖబరస్తాన్ ను సందర్శించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ. 1.33 కోట్లతో దీనిని ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక శ్మశాన వాటికల్లో సౌకర్యాలు కల్పించక పోగా వాటిని సైతం వదలడం లేదని మండిపడ్డారు.
వైసీపీ దొంగలు కబ్జాకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు నారా లోకేష్. గత నాలుగు ఏళ్ల జగన్ పాలనలో వేల కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సారావుపేటలో మసీదు ఆస్తుల కోసం పోరాడిన వ్యక్తిని నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్.
Also Read : Rajinikanth Touches : యోగి కాళ్లు మొక్కిన రజనీకాంత్