CM Indira Canteens : కొత్త‌గా 188 ఇందిరా క్యాంటీన్లు – సీఎం

రూ. 27 కోట్ల ఖ‌ర్చుతో మెరుగైన ఆహారం

CM Indira Canteens : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇప్ప‌టికే కొలువు తీరిన ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌లో ఇచ్చిన హామీ మేర‌కు అద‌నంగా వ‌స‌తి సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే వేలాది మంది ఆక‌లిని తీరుస్తున్నాయి ఇందిరా క్యాంటీన్లు. ఇందులో టిఫిన్లు, భోజ‌నం కూడా త‌క్కువ ధ‌ర‌కు నాణ్య‌వంతంగా ల‌భిస్తోంది. దీనిని ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తోంది. రోజు రోజుకు పెద్ద ఎత్తున ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో మ‌రికొన్ని ఇందిరా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదించారు ప్ర‌జా ప్ర‌తినిధులు.

CM Indira Canteens Viral in Karnataka

ఈ మేర‌కు క‌ర్ణాట‌క కేబినెట్ సీఎం అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైంది. కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 188 కొత్తగా ఇందిరా క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు సీఎం సిద్ద‌రామ‌య్య‌(CM Siddaramaiah). ఈ ఏర్పాటుకు మంత్రివ‌ర్గం వెంట‌నే ఆమోదం తెలిపింద‌ని స్ప‌ష్టం చేశారు.

వీటిని సాధ్య‌మైనంత త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌భుత్వం రూ. 27 కోట్ల‌ను కేటాయించింద‌ని తెలిపారు సీఎం. ఇక నుంచి క‌స్ట‌మ‌ర్లు అదే ధ‌ర‌లో కొత్త మెనూ, మెరుగైన ఆహారాన్ని పొందుతార‌ని స్ప‌ష్టం చేశారు సిద్ద‌రామ‌య్య‌.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ పాల‌న‌లో మైనార్టీ ఆస్తులు క‌బ్జా

Leave A Reply

Your Email Id will not be published!