KC Venu Gopal : ఛత్తీస్ గడ్ లో 75 సీట్లు గెలుస్తాం
సెప్టెంబర్ 3న రాహుల్ 8న ఖర్గే
KC Venu Gopal : ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి స్థాయిలో గెలుపొందే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయన(KC Venu Gopal) ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి సంబంధించి జోష్యం చెప్పారు. కనీసం కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుస్తుందని చెప్పారు.
KC Venu Gopal Said
ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 2న ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపారు. ఇదే సమయంలో 8న ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాష్ట్రంలో పర్యటిస్తారని స్పష్టం చేశారు కేసీ వేణుగోపాల్.
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ , దాని అనుబంధ పార్టీల హవా కొనసాగుతోందన్నారు. ఇప్పటికే పలు సర్వేలు సైతం కాంగ్రెస్ , ప్రతిపక్షాల కూటమి ఇండియా గణనీయమైన ఓటు బ్యాంకును పొందుతాయని, ఇదే సమయంలో సీట్ల సంఖ్య కూడా ఆశించిన మేర కంటే ఎక్కువగా వస్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు కేసీ వేణుగోపాల్.
కర్ణాటకలో ఇప్పటికే కొలువు తీరామని, త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో కూడా తాము బంపర్ మెజారిటీ సాధిస్తామని పేర్కొన్నారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో తమ పార్టీ సత్తా చాటుతుందన్నారు. ఇక రాజస్థాన్ లో తిరిగి అధికారంలోకి వస్తామని చెప్పారు కేసీ వేణుగోపాల్.
Also Read : MLA Jagga Reddy : దుష్ప్రచారం చేస్తే ఊరుకోను – జగ్గారెడ్డి