Liquor Shops Tenders : మవైన్ షాపులకు దరఖాస్తుల వెల్లువ
తెలంగాణలో 1,31,000 దరఖాస్తులు
Liquor Shops Tenders : తెలంగాణలో ఊహించని రీతిలో మద్యం దుకాణాలకు భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 1,31,000 దరఖాస్తులు రావడం విశేషం. గతంలో ఎప్పుడూ లేని రీతిలో అప్లై చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. చివరి రోజు కావడంతో పోటీ పడ్డారు. ఒకరికి మించి మరొకరు వైన్ షాపులు చేజిక్కించు కునేందుకు బారులు తీరారు. క్యూ కట్టారు. రాష్ట్రంలోని ఎక్సైజ్ ఆఫీసులన్నీ దరఖాస్తు దారులతో కిటకిట లాడాయి. ఆఖరి రోజు 56 వేల 980 దరఖాస్తులు రావడం విస్తు పోయేలా చేసింది. దుకాణాల కేటాయింపునకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ఈసారి రిజర్వేషన్ ప్రక్రియ కూడా అమలు చేసింది.
Liquor Shops Tenders in Telangana
పెద్ద ఎత్తున దరఖాస్తు చేసేందుకు రావడంతో భారీ ఎత్తున బందో బస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆయా ఆఫీసుల వద్ద తొక్కిసలాట జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఈ ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని 2,620 మద్యం షాపులకు 1,31,490 దరఖాస్తులు(Liquor Shops Tenders) వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఒక్కో మద్యం షాపునకు కనీసం 50 మందికి పైగా పోటీ పడుతున్నారు.
దరఖాస్తుల పరంగా చూస్తే సరూర్ నగర్ లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. 10,908 రాగా రెండో స్థానంలో శంషాబాద్ నిలిచింది. ఇక్కడ 10 , 811 దరఖాస్తులు అందాయి. ఇక అతి తక్కువగా దరఖాస్తు చేసుకున్న జిల్లాలలో ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ఉన్నాయి. ఆగస్టు 21న సోమవారం లాటరీ పద్దతిలో దుకాణాలను కేటాయించనున్నారు.
Also Read : MP Santosh Kumar : ఎంపీ సంతోష్ కు చెర్రీ కంగ్రాట్స్