Madan Lal Viral : మదన్ లాల్ ఫోటో వైరల్
బీఆర్ఎస్ లో టికెట్ల పంచాయతీ
Madan Lal Viral : నిన్నటి దాకా బీఆర్ఎస్ బాస్ ఏది చెబితే అది ఫైనల్. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఎవరికి వారే టికెట్లను ఆశిస్తున్నారు. మరికొందరు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. చాలా చోట్ల ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మరికొందరు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల జాబితా కసరత్తు ఒక సవాల్ గా మారింది ఈసారి బీఆర్ఎస్ బాస్ కు. తాజాగా ఈసారి శాసనసభ ఎన్నికల్లో వైరా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ను ఆశించారు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్. ఇక్కడ ఎమ్మెల్యే గా రాములు నాయక్ ఉన్నారు. ఈ సందర్బంగా టికెట్ బరిలో తనకు కాకుండా మదన్ లాల్ ప్రయత్నం చేయడంపై రాములు నాయక్ అనుచరులు భగ్గుమన్నారు.
Madan Lal Viral With Photo on Media
ఈ మేరకు మదన్ లాల్(Madan Lal) ఓ మహిళతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. రాబోయే ఎన్నికలకు సంబంధిం బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ల కోసం ఆయా ఆశావహులు విచిత్రమైన ప్రయత్నాలు చేస్తుండడం పార్టీ వర్గాలను విస్తు పోయేలా చేస్తోంది. ఇదిలా ఉండగా తాటికొండ రాజయ్య రాజా శ్యామల యాగం చేశారు.
చర్చిలో ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ ఇవ్వలేక పోతే తట్టుకోలేనంటూ ఓ మహిళ మీడియా సాక్షిగా కంట తడి పెట్టింది. కొత్తగూడెం నుండి బీఆర్ఎస్ టికెట్ విషయంలో వనమా , జలగం మధ్య పోరు నడుస్తోంది. ప్రజా రోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ జి. శ్రీనివాసరావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Also Read : CM KCR Inuagurated : గుడి..మసీద్..చర్చి రెడీ