Mynampally Hanumanta Rao : హరీశ్ ను అన్నా పార్టీని కాదు
మైనంపల్లి హనుమంత రావు
Mynampally Hanumanta Rao : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల సాక్షిగా రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రాపుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు స్లిప్పర్లతో ఉన్న వాడికి ఎలా లక్ష కోట్లు వస్తాయని ప్రశ్నించారు. తాను అడగడం లేదని మెదక్ జిల్లా ప్రజలు తెలుసు కోవాలని కోరుతున్నారంటూ చెప్పారు. ఎమ్మెల్యే మైనంపల్లి(Mynampally Hanumanta Rao) చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి.
Mynampally Hanumanta Rao Comments Viral
మైనంపల్లి వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. తమకు మా బావ ముఖ్యమని నువ్వు కాదంటూ పేర్కొన్నారు. ఆయన ముందు నుంచీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారం కలకలం రేగడంతో బీఆర్ఎస్ పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ మీడియా సాక్షిగా స్పందించారు. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే పార్టీకి కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. లేకపోతే వేటు తప్పదని హెచ్చరించారు.
ఈ తరుణంలో మైనంపల్లి మాట్లాడుతూ హరీశ్ ఎపిసోడ్ పై స్పందించారు. తాను హరీశ్ రావు గురించి అన్నానే తప్పా బీఆర్ఎస్ పార్టీ గురించి అనలేదన్నారు . క్యాడర్ తో మాట్లాడాక తన యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
Also Read : Satyavathi Rathod : కడియం అన్నా కంగ్రాట్స్