IJU TUWJ : ఇళ్ల స్థలాలు సరే కామెంట్స్ మాటేంటి
ఐజేయూ,టీయూడబ్ల్యూజే కామెంట్స్
JU TUWJ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టు నేతలు. మంగళవారం ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్ష, కార్యదర్శులు కె. శ్రీనివాస్ రెడ్డి, వై నరేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (TUWJ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగుసూరి శేఖర్, కే. విరాహత్ లు మీడియాతో మాట్లాడారు.
JU TUWJ Said KCR
ఈ సందర్భంగా జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ను తప్పు పట్టారు. జర్నలిస్టులు అన్నాక పొద్దస్తమానం సీఎంను, ప్రభుత్వాన్ని పొగుడుతూ కూర్చోరని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని చెప్పారు.
అయితే ప్రభుత్వంపై విమర్శనాత్మక కథనాలు ఇస్తున్న మీడియా సంస్థల్లో పని చేస్తున్న జర్నలిస్టులకు
ఇండ్ల స్థలాలు ఇచ్చే ప్రసక్తి లేదంటూ హెచ్చరించడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు జర్నలిస్టు నేతలు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
మీడియాలో అవాస్తవ కథనాలు, వార్తలు వస్తే వివరణ ఇవ్వడం, ఖండించడం, ఇంకా కాదని అనుకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి హక్కు ఉంటుందన్నారు. మీడియా సంస్థల పాలసీకి జర్నలిస్టులను జవాబుదారీ చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
శాసనసభలో ప్రతిపక్షాల సభ్యులు తమ లోపాలను ఎత్తి చూపుతుంటే వారి జీతాలు, అలవెన్సులు ఆపు చేస్తున్నారా అని నిలదీశారు. ఇకనైనా ఇలాంటి అనాలోచిత మాటలు మాట్లాడవద్దని కోరారు.
Also Read : MLA Jeevan Reddy : సీఎం ఆశీర్వాదం జీవన్ రెడ్డి సంతోషం