TTD Donate : టీటీడీకి క్వాంటం ఎనర్జీ విరాళం
ద్విచక్ర వాహనం అందజేత
TTD Donate : పుణ్య క్షేత్రం తిరుమల లో కొలువై ఉన్న శ్రీనివాసుడికి నిత్యం భక్తులు కానుకలు, విరాళాలు సమర్పించు కోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం శ్రీవారికి క్వాంటం ఎనర్జీ లిమిటెడ్ (సీఏఎల్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి. చక్రవర్తి విద్యుత్ తో నడిచే దిచక్ర వాహనాన్ని విరాళంగా అందజేశారు.
TTD Donate Viral
ఈ విద్యుత్ వాహనం ధర రూ. 1,18,275 అని సంస్థ ఎండీ వెల్లడించారు. ముందుగా ఆలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం వాహనం తాళాలను తిరుమల డీఐ జానకీ రామ్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) మాజీ బోర్డు సభ్యులు భాను ప్రకా్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఇక కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా శ్రీ వేంకటేశ్వర స్వామికి పేరుంది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. భక్తులు నిత్యం కానుకలు, విరాళాల రూపేణా స్వామి వారికి అందజేస్తారు.
ఇందుకు సంబంధించి శ్రీవారి హుండీని ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. పెద్ద ఎత్తున కానుకలు, వాహనాలు, ఆభరణాలు స్వామి వారికి ఉన్నాయి. ప్రతి రోజూ ఇలాంటి విరాళాలు ఇస్తూనే ఉన్నారు భక్తులు.
Also Read : TTD EO : వేగంగా భక్తుల లగేజి నిర్వహణ