Swaroopananda Swamy : ధ‌ర్మ ప్ర‌చారం విస్తృతంగా చేయాలి

శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానంద స్వామి పిలుపు

Swaroopananda Swamy : యువ‌త‌లో ధార్మిక భావాలు పెంపొందించేలా ధ‌ర్మ ప్ర‌చారాన్ని విస్తృతంగా చేయాల‌ని పిలుపునిచ్చారు విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానంద స్వామీజీ. రుషికేష్ లోని ఆశ్ర‌మంలో ఉన్న స్వ‌రూపానంద స్వామీజీని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గా నూత‌నంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన , తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు క‌లుసుకున్నారు.

Swaroopananda Swamy Blessed TTD Chairman

ఈ సంద‌ర్బంగా స్వామి వారి ఆశీర్వ‌చ‌నాలు అందుకున్నారు. ధ‌ర్మ ప్ర‌చారంపై ఎక్కువ‌గా దృష్టి పెట్టాల‌ని సూచించారు స్వామీజీ. భ‌క్తులు, వ‌న్య ప్రాణుల‌కు ర‌క్షిత జోన్ గా న‌డ‌క దారుల‌ను అభివృద్ది చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. వేద పారాయ‌ణ‌దారుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని కోరారు.

భ‌క్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల‌ని, వ‌స‌తి సౌక‌ర్యాల‌ను మ‌రింత మెరుగు ప‌ర్చాల‌ని తెలిపారు. ఎంతో దూరం నుండి స్వామి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు అష్ట‌క‌ష్టాలు ప‌డి వ‌స్తార‌ని ఆ విష‌యం టీటీడీ(TTD) పాల‌క మండ‌లి గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

స్వామి వారికి శ్రీ‌వారి ప్ర‌సాదాన్ని అందించారు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తులు. శాలువాతో స‌త్క‌రించారు. అనంత‌రం క‌రుణాక‌ర్ రెడ్డి దంప‌తుల‌ను విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానంద స్వామీజీ శాలువాతో స‌త్క‌రించారు. ఆశీర్వ‌చ‌నాలు అంద‌జేశారు. పీఠం ఉత్త‌రాధికారి శ్రీ స్వాత్మానంద స్వామిని కూడా చైర్మ‌న్ దంప‌తులు శాలువాతో స‌న్మానించారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల క్షేత్రం పోటెత్తిన భ‌క్తజ‌నం

Leave A Reply

Your Email Id will not be published!