Ayutha Chandi Yagam : చండీ యాగం కళ్యాణోత్సవం
పోటెత్తిన భక్త బాంధవులు
Ayutha Chandi Yagam : శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 80వ విశ్వ శాంతి మహాయాగ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా సాగుతోంది. జడ్చర్ల పట్టణంలో ఆగస్టు 14న ప్రారంభమైన అయుత చండీ అతిరుద్ర యాగానికి భక్తులు పోటెత్తారు. ఈనెల 27 వరకు ఈ యాగం కొనసాగుతుంది.
Ayutha Chandi Yagam in Jadcherla
స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ సుబ్రమణ్య స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాగ కార్యక్రమాలలో భాగంగా మంగళవారం వివాహం కాని ఆడ, మగవారికి హోమాలు చేపట్టారు. అనంతరం ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించారు.
బుధవారం ఉదయం సర్వ సూక్త, సుబ్రహ్మణ్య సమేత సంతాన వేణుగోపాల హోమాలు జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవం చేపట్టనున్నారు. ఇక 24న గురువారం ఉదయం 7 గంటలకు శ్రీ మేధా దక్షిణ మూర్తి, రామ గాయత్రి సహిత చండీ హోమాలు , సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు.
25న శుక్రవారం ఉదయం 7 గంటలకు చండీ సహిత నవ దుర్గ హోమాలు , సామూహిక లక్ష్మీ వ్రతం ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు వరలక్ష్మి అమ్మ వారికి విశేష చక్ర అర్చన, పంచామృత అభిషేకం , లక్ష గాజుల అర్చన, లక్ష కుంకుమ అర్చన ఉంటుంది.
26న శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ సుదర్శన పూర్వక మహా మృత్యుంజయ, వరలక్ష్మీ సమేత మహా నారాయణ హోమాలు, సీతారాములకు విశేష అభిషేకాలు జరుపుతారు.
27న ఆదివారం 11.48 నిమిషాలకు మహా పూర్ణాహుతి, గురు పూజ, శ్రీకృష్ణ ఉట్టి కొట్టడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీరాధా కృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవంతో పూర్తవుతుంది.
Also Read : Swaroopananda Swamy : ధర్మ ప్రచారం విస్తృతంగా చేయాలి