CM KCR Congrats : బడే నాగ జ్యోతికి కేసీఆర్ కంగ్రాట్స్
ఆశీర్వదించిన తెలంగాణ సీఎం
CM KCR Congrats : ఎవరీ బడే నాగ జ్యోతి అనుకున్నారా. ఇప్పుడు తెలంగాణలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. కారణం ఏమిటంటే సీఎం కేసీఆర్(KCR) ఆమెకు అరుదైన అవకాశం ఇచ్చారు.
తాజాగా త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున అభ్యర్థిగా ప్రకటించారు బడే నాగ జ్యోతిని. ఇక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ నక్సలైట్ దాసరి సీతక్క.
CM KCR Congrats to Naga Jyothi
ఇక బడే నాగ జ్యోతి విద్యాధికురాలు. ఆమె కాకతీయ యూనివర్శిటీ నుంచి ఎమ్మెల్సీ, బీఈడి చేశారు. కేసీఆర్ తన పేరును ప్రకటించిన వెంటనే కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది తన జీవితంలో ఊహించని నిర్ణయమని పేర్కొన్నారు.
బడే నాగ జ్యోతి గ్రామ సర్పంచ్ గా గెలుపొందారు. జెడ్పీటీసీగా విజయం సాధించారు. ప్రస్తుతం చైర్ పర్సన్ గా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా బుధవారం మర్యాద పూర్వకంగా సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలుసుకున్నారు. ఈ సందర్బంగా బడే నాగ జ్యోతిని కేసీఆర్ ఆశీర్వదించి..అభినందించారు.
Also Read : Sachin Tendulkar : నేషనల్ ఐకాన్ గా సచిన్ – ఈసీ