PM Modi : ప్రధాని మోదీకి గ్రీస్ పురస్కారం
గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. గ్రీస్ పర్యటనలో ఉన్న ఆయనకు ఆ దేశ ప్రభుత్వం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్ పురస్కారాన్ని అందించారు. ఆ దేశ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లారోపౌలౌ శుక్రవారం అందజేశారు.
ఈ సందర్బంగా మోదీ మాట్లాడారు. గ్రీస్ , భారత్ దేశాలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దేశాలని అన్నారు. రక్షణ, సాగు, విద్యా రంగాలలో పరస్పర సహకారానికి అంగీకరించినట్లు చెప్పారు. గత కొన్నేళ్లుగా కలిసి పని చేస్తున్నాయని స్పష్టం చేశారు.
PM Modi Got a Special Reward
ప్రస్తుతం ప్రపంచానికి సవాల్ గా ఉగ్రవాదం మారిందన్నారు మోదీ(PM Modi). దీనిని ఎదుర్కొనేందుకు ప్రతి దేశం ముందుకు రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారత్ హింసపై యుద్దం ప్రకటిస్తోందన్నారు. తాము శాంతియుతంగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు పీఎం.
ఈ సందర్బంగా తనకు అత్యున్నత పురస్కారంతో సత్కరించినందుకు గ్రీస్ దేశానికి, ఈ ప్రాంత ప్రజలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఇదే సమయంలో భారత దేశానికి పీఎంగా కొలువు తీరాక పలు అవార్డులు అందుకున్నారు మోదీ. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పవర్ ఫుల్ లీడర్లలో పీఎం టాప్ లో నిలిచారు. ఆయన ఈ దేశాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
Also Read : Minister KTR : హైదరాబాద్ లో మెట్ లైఫ్