Revanth Reddy : కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల వెల్లువ
ఆగస్టు 25 అప్లైకి దరఖాస్తు ఆఖరు
Revanth Reddy : తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీలో పోటీదారులు ఎక్కువయ్యారు. ప్రస్తుతం పార్టీ విచిత్రంగా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని అనుకున్న వారు డబ్బులు చెల్లించాలని పార్టీ నిర్ణయించింది. ఓసీలైతే 50,000 రూపాయలు , బీసీలైతే 25,000 చెల్లించాలని స్పష్టం చేసింది.
Revanth Reddy from Kondangal Constituency
ఆగస్టు 25 దరఖాస్తు చేసుకునేందుకు డెడ్ లైన్ ప్రకటించింది. దీంతో ఆశావహులతో గాంధీ భవన్ నిండి పోయింది. ఇప్పటి దాకా టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కోడంగల్ నుంచి రేవంత్ రెడ్డి(Revanth Reddy) దరఖాస్తు చేసుకున్నారు.
ఎల్బీ నగర్ నుంచి మధు యాష్కి గౌడ్ , మల్ రెడ్డి రంగారెడ్డి, నాగార్జున సాగర్ నుంచి కందూరు జానా రెడ్డి, జానా రెడ్డి కొడుకులు రఘు వీర్ రెడ్డి, జయ వీర్ రెడ్డి, ఆందోల్ నుంచి దామోదర్ రాజ నరసింహ, కూతురు త్రిష అప్లై చేసుకున్నారు.
ములుగు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి అనసూయ, పినపాక నుంచి సీతక్క కొడుకు సూర్యం, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. మిర్యాలగూడ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, కరీంనగర్ నుంచి రమ్యా రావు, ఆమె తనయుడు రితేష్ రావు అప్లై చేశారు.
ముషీరాబాద్ నుంచి అంజన్ యాదవ్, తనయుడు అనిల్ యాదవ్ , మునుగోడు నుంచి పున్నా కైలాష్ , ఖైరతాబాద్ నుంచి విజయా రెడ్డి, రోహిణ్ రెడ్డి, వినోద్ రెడ్డి, మధిర నుంచి భట్టి విక్రమార్క అప్లై చేసుకున్నారు.
Also Read : PM Modi : ప్రధాని మోదీకి గ్రీస్ పురస్కారం