Revanth Reddy Contest : కోడంగల్ నుంచి రేవంత్ పోటీ
దరఖాస్తు చేసుకున్న ఎంపీ
Revanth Reddy Contest : టీపీసీసీ చీఫ్ , మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy) రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
Revanth Reddy Contest from Kondangal
త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొత్తగా సంచలన నిర్ణయం తీసుకుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డబ్బులు చెల్లించాలని నిర్ణయించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి.
విచిత్రం ఏమిటంటే ఓసీలకు రూ. 50 వేలు, బీసీలకు రూ. 25 వేలు నిర్ణయించింది పార్టీ. తాజాగా పలువురు సీనియర్ నేతలు ఆయా నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరిన పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
అనంతరం పార్టీ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత టీపీసీసీ చీఫ్ గా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తన వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు.
Also Read : Revanth Reddy : కాంగ్రెస్ పార్టీలో దరఖాస్తుల వెల్లువ