Bandi Sanjay : సగం మందికి కేసీఆర్ సీట్లు ఇవ్వడు
బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కుమార్
Bandi Sanjay : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీఆర్ఎస్ చీఫ్ , తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు 119 సీట్లకు గాను 115 ప్రకటించిన సీట్లకు సంబంధించిన అభ్యర్థులలో సగం మందికి కూడా సీట్లు ఇవ్వడని షాకింగ్ కామెంట్స్ చేశారు.
Bandi Sanjay Comments Viral
ఏదో ఒక పేరుతో, నెపంతో వారిని పక్కన పెడతాడని అన్నాడు. కేసీఆర్ రాజకీయం తనకంటే బాగా ఎవరికీ తెలియదన్నారు. తమ పార్టీ నుంచి పక్క పార్టీలలోకి వెళ్లకుండా ఉండేందుకే సీఎం ఈ డ్రామా ఆడుతున్నాడని ఆరోపించారు.
ఇదంతా రాజకీయంలో ఒక భాగమని, తనకంటే ఇతర నేతలకు తెలివి లేదని అనుకుంటున్నాడని, కానీ తనంత మూర్ఖుడు ఈ దేశంలో ఎవరూ లేరంటూ మండిపడ్డారు బండి సంజయ్ కుమార్(Bandi Sanjay). గులాబీ బాస్ కు దిమ్మ తిరిగేలా ఈసారి ఎన్నికల ఫలితాలు ఉండ బోతున్నాయని జోష్యం చెప్పారు.
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , ఇది తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Also Read : Allu Arjun : బన్నీ ఇంట్లో సెలబ్రేషన్స్