CM KCR : సీఎం కేసీఆర్ ఖుష్ క‌బ‌ర్

కాంట్రాక్ట్ టీచ‌ర్ల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ

CM KCR : రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో సీఎం కేసీఆర్(KCR) హామీల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆపై కోరిన కోర్కెలు తీరుస్తున్నారు. నిన్న‌టి దాకా ఆర్టీసీ ప‌ట్ల అంత‌గా దృష్టి పెట్ట‌ని సీఎం ఉన్న‌ట్టుండి వారికి తీపిక‌బురు చెప్పారు.

ఆర్టీసీ ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్టీసీని ప్ర‌భుత్వంలో విలీనం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. దీనిపై గ‌వ‌ర్న‌ర్ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. చివ‌ర‌కు ఆమోద ముద్ర ప‌డింది.

CM KCR Good News for Teachers

తాజాగా కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠ‌శాల‌లో కాంట్రాక్ట్ టీచ‌ర్లుగా ప‌నిచేస్తున్న వారంద‌రినీ రెగ్యుల‌రైజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో ఉత్త‌ర్వులు జారీ చేయ‌నుంది.

ఈ ప్ర‌క‌ట‌న‌తో రాష్ట్ర వ్యాప్తంగా 567 మంది కాంట్రాక్టు టీచ‌ర్లు రెగ్య‌ల‌రైజ్ కానున్నారు. 16 ఏళ్లుగా కాంట్రాక్టు ప‌ద్ద‌తిలో టీచ‌ర్లుగా కొన‌సాగుతున్నారు. తాము కొన్నేళ్లుగా వెట్టి చాకిరి చేస్తున్నామ‌ని వాపోయారు. ఆపై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు, ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. మొత్తంగా ఈ వార్త‌తో వారిలో సంతోషం వ్య‌క్తం అవుతోంది.

Also Read : Tummala Nageswar Rao : వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉంటా

Leave A Reply

Your Email Id will not be published!