Gaddam Vivek : పార్టీ మార్పుపై వివేక్ కామెంట్
కాంగ్రెస్ లోకి చేరిక ఖాయమేనా
Gaddam Vivek : భారతీయ జనతా పార్టీకి ఝలక్ ఇవ్వబోతున్నారా మాజీ ఎంపీ వివేక్. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, తెలంగాణ రాజకీయాలను కొన్నేళ్లుగా శాసిస్తూ వచ్చిన గుడిసెల వెంకటస్వామి తనయుడు , న్యూస్ ఛానల్, పత్రిక చీఫ్ , వ్యాపార సామ్రాజ్యానికి చీఫ్ గా ఉన్న కరీంనగర్ మాజీ ఎంపీ గడ్డం వివేక్(Gaddam Vivek) పార్టీ మారేందుకు సిద్దపడ్డారా. అవుననే ప్రచారం జోరుగా కొనసాగుతోంది.
Gaddam Vivek Not Responded
ఇప్పటి వరకు ఆయన తన రాజకీయ కెరీర్ లో మూడు సార్లు పార్టీలు మారారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అక్కడ తనకు ప్రయారిటీ ఇవ్వడం లేదని వాపోయారు. ఆ వెంటనే గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ పంచన చేరారు.
కేసీఆర్ ధోరణి నచ్చక గులాబీకి గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయ్యారు. కమలం కండువా కప్పుకున్నారు. అటు తనకు రాజకీయంగా బూస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. ఆపై తనను చేరదీసిన కేసీఆర్ ను తూలనాడారు.
ప్రస్తుతం బీజేపీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదన్న ఆవేదనతో మనసు మార్చుకున్నట్లు సమాచారం. తిరిగి తన స్వంత గూటికి కాంగ్రెస్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు టాక్. ఇందుకు సంబంధించి ఆగస్టు 30న ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ మారుతున్నారా అన్న ప్రశ్నకు గడ్డం వివేక్ నవ్వుకుంటూ వెళ్లి పోయారు.
Also Read : Telangana Congress : 119 సీట్లు 1020 దరఖాస్తులు