Seetha Dayakar Reddy : కాంగ్రెస్ లోకి సీతా దయాకర్ రెడ్డి
రేవంత్ రెడ్డితో మేడం భేటీ
Seetha Dayakar Reddy : టీడీపీ మాజీ ఎమ్మెల్యే, దివంగత కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. బుధవారం ఆమె టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిని కలిశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
Seetha Dayakar Reddy Will Join in Congress
ఇటీవలే తీవ్ర అనారోగ్యంతో కొత్త కోట దయాకర్ రెడ్డి మృతి చెందారు. ఆమె చేరికతో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఆమె స్వస్థలం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్. అక్టోబర్ 27, 1961లో పుట్టారు.
సీతా దయాకర్ రెడ్డి(Seetha Dayakar Reddy) తెలంగాణ రాజకీయాలలో పేరు పొందిన నాయకురాలు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ తరపున దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2009లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఆమె ఎంఏ సోషియాలజీ చదివారు.
1984లో కొత్త కోట దయాకర్ రెడ్డితో వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1994లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2001లో దేవరకద్ర జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. 2009లో తన సమీప అభ్యర్థి స్వర్ణ సుధాకర్ రెడ్డిపై 19,034 ఓట్ల తేడాతో గెలుపొందారు ఎమ్మెల్యేగా.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి చేతిలో ఓటమి పాలైంది.
Also Read : Vijay Devarakonda : తిలక్ వర్మకు విజయ్ కంగ్రాట్స్