Revanth Reddy : ప్రజలను మోసం చేస్తున్న మోదీ
పెంచి తగ్గించడం ఇదో రాజకీయం
Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక గజ దొంగ దారి దోపిడీ చేసి ..సర్వం దోచుకుని ..దారి ఖర్చు ల కోసం రూ. 2000 ఉంచుకోమని ఇచ్చినట్లు ఉందని పేర్కొన్నారు.
Revanth Reddy Slams PM Modi
తాజాగా కేంద్ర సర్కార్ గ్యాస్ వినియోగదారులకు తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం ఉన్న గ్యాస్ ధరను రూ. 200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). తమ పార్టీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండేదని కానీ మోదీ కొలువు తీరాక అది రూ. 1200 దాకా వెళ్లిందని ఆరోపించారు.
ఓ వైపు గ్యాస్ ఇంకో వైపు పెట్రోల్, డీజిల్ బాదుడుతో జనం గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేవి సార్వత్రిక ఎన్నికలను, అందుకే ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకే ఈ నాటకం ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి.
మినిమం వంట గ్యాస్ ధర రూ. 500 లోపు ఉండాలని సూచించారు. ఇతర దేశాలలో రూ. 300 కంటే తక్కువగా ఉందని వెల్లడించారు. ప్రజల చెవుల్లో పూలు పెట్టడం మానుకొని దేశ సంక్షేమం కోసం పని చేస్తే బావుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి హితవు పలికారు ఎనుముల రేవంత్ రెడ్డి.
Also Read : Seetha Dayakar Reddy : కాంగ్రెస్ లోకి సీతా దయాకర్ రెడ్డి