Temjen Imna Along : సానుకూల దృక్పథం సంతోషానికి మార్గం
నాగాలాండ్ పర్యాటక, విద్యా శాఖ మంత్రి
Temjen Imna Along : భారతీయ జనతా పార్టీలో మోస్ట్ పాపులర్ లీడర్లలో ఒకరుగా గుర్తింపు పొందారు నాగాలాండ్ బీజేపీ చీఫ్ , ఆ రాష్ట్ర పర్యాటక , ఉన్నత విద్యా శాఖ మంత్రి టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒకటి పోస్ట్ చేస్తుంటారు. తన ఆలోచనలను పంచుకుంటారు. మొత్తంగా బీజేపీలో ప్రధానమంత్రి మోదీ తర్వాత అత్యంత జనాదరణ పొందిన నాయకుడిగా నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు.
Temjen Imna Along Comments Viral
ఇమ్నా ఒకప్పుడు టీచర్ గా పని చేశాడు. ఆ తర్వాత బీజేపీ పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ వెంటనే తన పదవికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నాడు. బీజేపీలో అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయికి ఎదిగాడు. బీజేపీకి చీఫ్ గా ఎన్నికయ్యాడు.
రాష్ట్రంలో అత్యధిక సీట్లను పొందేలా కృషి చేశాడు. ఆపై మంత్రిగా కొలువు తీరాడు. తనకు విద్యా రంగం అంటే ఇష్టం. అత్యంత సాధారణ జీవితం గడిపేందుకు ఇష్టపడే టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్(Temjen Imna Along) ఏది మాట్లాడినా ఆచి తూచి మాట్లాడతారు. ప్రత్యేకించి తన ప్రాంతం అన్నా, ఈ దేశం అన్నా వల్లమాలిన అభిమానం.
ఎవరైనా పలకిరించినా వెంటనే పిలిచే పలికే నాయకుడిగా గుర్తింపు పొందాడు. తాజాగా కీలక మైన వ్యాఖ్యలు చేశారు ఈ మంత్రి. సంతోషం కావాలంటే సానుకూల దృక్ఫథాన్ని అలవాటు చేసుకోవాలని సూచించాడు.
Also Read : Revanth Reddy : ప్రజలను మోసం చేస్తున్న మోదీ