Tummala KCR : చెదిరిన స్నేహం గులాబీకి దూరం
బీఆర్ఎస్ ను వీడనున్న తుమ్మల
Tummala KCR : రాజకీయాల్లో శాశ్వత స్నేహం అన్నది ఉండదు. అలా ఉంటే అది కేవలం బంధుత్వానికి మాత్రమే పరిమితం అవుతుంది. ప్రత్యేకించి రాజకీయాలను నిత్యం చదరంగం లాగా భావించే ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒక్కరు బీఆర్ఎస్ (టీఆర్ఎస్) బాస్ ,తెలంగాణ సీఎం కేసీఆర్.
Tummala KCR Words
ఆయన ఎవరిని ఎప్పుడు దగ్గరకు తీసుకుంటారో , ఎవరిని ఎప్పుడు చేరదీస్తారో ఆయనకు తప్ప తనయుడు కేటీఆర్, తనయ కవిత, భార్య శోభ, అల్లుడు హరీశ్ రావుకు తెలియదు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చెప్పలేరు. అలా అయితే ఆయన కేసీఆర్ ఎందుకవుతారు.
బహుశా చదరంగం ఆడే క్రీడాకారులు సైతం విస్తు పోయే ఆలోచనలు, వ్యూహాలు కేసీఆర్(KCR) స్వంతం. అందుకే ఆయన ఎవరినైనా పొగిడినా లేదా కాదన్నా ఎవరో ఒకరికి మూడిందని అర్థం . ఆ మధ్యన మాజీ మంత్రి తుమ్మలను దగ్గరకు తీసుకున్నారు. ఆయన ఖమ్మం జిల్లాలో పట్టు కలిగిన నాయకుడు. గులాబీ కండువా కప్పుకున్నాడు. కానీ ఉన్నట్టుండి తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మాజీ మంత్రికి మొండి చేయి చూపించారు కేసీఆర్.
ఇద్దరూ కలిసి గతంలో టీడీపీ పాలనలో కీలకమైన పదవులలో ఉన్న వారే. కానీ ప్రస్తుతం తెలంగాణలో సీఎం కేసీఆర్ హవా నడుస్తోంది. టికెట్ రాక పోవడంతో మనస్తాపానికి గురైన తుమ్మల ఇక గులాబీకి గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.
Also Read : YSR Rythu Bharosa : కౌలు రైతులకు ఆసరా రైతు భరోసా