India Alliance : 30 లోగా సీట్ల షేరింగ్

ఇండియా కూట‌మి కీల‌క నిర్ణ‌యం

India Alliance : దేశ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో ఇండియా కూట‌మి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ ముంబై వేదిక‌గా కూటమి ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిప‌క్షాలు భేటీ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వ‌చ్చే 30వ తేదీ లోగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సంబంధించి దేశంలోని ఆయా రాష్ట్రాల‌లో సీట్ల పంపకానికి సంబంధించి ఒక అంచ‌నాకు రావాల‌ని తీర్మానం చేశారు.

India Alliance Meeting in Mumbai

ఇండియా కూట‌మి రెండు రోజుల పాటు స‌మావేశం కానుంది. ఈ కీల‌క‌మైన భేటీకి అతిర‌థ మ‌హార‌థులు హాజ‌ర‌య్యారు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi), ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ , టీఎంసీ చీఫ్ , ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ ముక్తీ మోర్చా చీఫ్ , సీఎం హేమంత్ సోరేన్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ , మాజీ సీఎంలు ఫ‌రూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాద‌వ్ , శివ‌సేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్‌, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, త‌దిత‌ర ప్ర‌ముఖ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

ఇండియా కూట‌మి ప్ర‌తిపాదించిన ఫార్ములాను పార్టీల రాష్ట్ర క‌మిటీలు అమ‌లు చేయ‌నున్నాయ‌ని స‌మాచారం. ఇక కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నారు. అదేమిటంటే ఇండియా కూట‌మి త‌ర‌పున బీజేపీకి వ్య‌తిరేకంగా ఒకే ఒక్క‌రు బ‌రిలో ఉండేలా చూడాల‌ని తీర్మానం చేశారు. ఇది ఓట్ల విభ‌జ‌న‌ను అడ్డుకుంటుంద‌ని ఆలోచ‌న‌. కూట‌మికి క‌న్వీన‌ర్ ఉండాలా వ‌ద్దా అన్న‌ది ఇంకా ఖ‌రారు కావాల్సి ఉంది. 28 రాజ‌కీయ పార్టీల నుండి 63 మంది ప్ర‌తినిధులు ఈ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఇండియా కూటమిలో మ‌రో నాలుగు కొత్త పార్టీలు చేర‌నున్నాయి.

Also Read : Rahul Gandhi : అదానీ వ్య‌వ‌హారం రాహుల్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!