Bhagwant Mann : ఇండియా బలమైన కూటమి
పంజాబ్ సీఎం భగవంత్ మాన్
Bhagwant Mann : భారత దేశ కూటమి దేశాన్ని రక్షించే దిశగా ఒక బలమైన ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఇవాళ ఇండియా కూటమి ఆధ్వర్యంలో కీలకమైన సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పంజాబ్ సీఎం హాజరయ్యారు.
Bhagwant Mann Comments on PM Modi
ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల అభిప్రాయాలకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఒక చోటుకు చేరడం శుభ పరిణామమని పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీలు, రాష్ట్రాలు, వ్యక్తులను, కంపెనీలను పనిగట్టుకుని మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ మండిపడ్డారు భగవంత్ మాన్(Bhagwant Mann). ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకునే సమయం ఆసన్నమైందన్నారు. మోదీ సర్కార్ కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇండియా కూటమిని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు భగవంత్ మాన్. దేశంలో మోదీ పాలనకు మూడిందంటూ ఎద్దేవా చేశారు.
ఎల్లకాలం మోదీ ప్రధానమంత్రిగా ఉండడం కుదరదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు భగవంత్ మాన్. పూర్తిగా రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Also Read : Arvind Kejriwal : అదానీ కోసం మోదీ సర్కార్