TTD EO : బ్రహ్మోత్సవాలకు సహకరించండి
సమీక్ష చేపట్టిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి
TTD EO : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తిరుమల అన్నమయ్య భవన్ లో సమీక్ష చేపట్టారు. పోలీసు శాఖ కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందన్నారు. టీటీడీ విజిలెన్స్ , ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
TTD EO Asking to Support
నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని , ట్రాఫిక్ కు అంతరాయం కలకుండా చూడాలని స్పష్టం చేశారు ఏవీ ధర్మా రెడ్డి. టీటీడీతో భక్తులు సహకరించాలని కోరారు. ఈసారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుండే దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారని తెలిపారు. ఈ తరుణంలో భద్రతపై ఫోకస్ పెట్టాలన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఇప్పటికే టీటీడీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు ఈవో ఏవీ ధర్మా రెడ్డి(TTD EO). క్యూ లైన్స్ , మాడ వీధులలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు పోలీసు శాఖ సమాయత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు.
గరుడోత్సవం రోజున సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి. అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాలను చెక్ చేస్తామన్నారు.
Also Read : Bandaru Dattatreya : మేకపాటిని కలిసిన దత్తన్న