Satya Pal Malik : ఓటు వజ్రాయుధం జర భద్రం
చదువుకున్న వాళ్లను ఎన్నుకోండి
Satya Pal Malik : జమ్మూ , కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని ప్రజలు ఆచి తూచి అడుగు వేయాలని, తమ విలువైన ఓటును పని చేసే వారికి వేయాలని సూచించారు.
Satya Pal Malik Words to Voters
విద్యాధికులను ఎన్నుకుంటే భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. రోజుకు 18 గంటల సమయం వెచ్చిస్తూ విలువైన కాలాన్ని దుర్వినియోగం చేసే నేతలను దూరంగా పెట్టాలని కోరారు సత్య పాల్ మాలిక్(Satya Pal Malik). ఈసారి జరిగే ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య పోరాటమని పేర్కొన్నారు .
దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రత్యేకించి మనం బాగు పడాలన్నా, మన పిల్లల కోసమైనా భారత రాజ్యాంగం కల్పించిన అరుదైన అవకాశం ఓటు హక్కు అని, దానిని పవిత్రంగా చూసు కోవాలని స్పష్టం చేశారు. నోట్లకు , మద్యానికి బానిసలై విలువైన ఓటును పని చేయని వాళ్లకు, అక్రమార్కులకు, దొంగలకు, మోసం చేసే వాళ్లకు వేసినట్లయితే దేశం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
ఓటు పట్ల ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మాజీ గవర్నర్. ప్రస్తుతం ఆయన కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపిస్తున్నారు.
Also Read : Team India Viral : టీమ్ ఇండియా వైరల్