Vijay Sai Reddy : విజినరీ అంటే దోచుకోవడమా
బాబుపై విజయ సాయి రెడ్డి
Vijay Sai Reddy : వైఎస్సార్సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఎంపీ స్పందించారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సర్కార్ తో కావాలని పదే పదే పొత్తు కోసం ప్రయత్నించడం ప్రజలంతా చూస్తున్నారని పేర్కొన్నారు.
Vijay Sai Reddy Slams Chandrababu Naidu
తనపై ఉన్న పాత కేసుల నుంచి రక్షించు కునేందుకు హస్తిన బాట పట్టారంటూ , ఇదే సమయంలో ఢిల్లీకి వెళితే పాత ఐటీ కేసు వెలుగు చూసిందన్నారు విజయ సాయి రెడ్డి(Vijay Sai Reddy). తవ్వి తీయాలే కానీ ఇలాంటివి 10 వేలకు పైగా అక్రమాలు బయట పడడం ఖాయమని జోష్యం చెప్పారు.
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం , ఢిల్లీలో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఏనాడూ రాష్ట్రం కోసం, దాని అభివృద్ది కోసం ఎలాంటి ప్రయత్నం చేసిన పాపాన పోలేదన్నారు విజయ సాయి రెడ్డి. ఇన్నాళ్లు ఆయన రాజకీయాలలో ఉన్నది కేవలం తన ఆస్తులను పెంచు కోవడం, ఉన్న వాటిని రక్షించు కోవడం కోసమేనని ఎద్దేవా చేశారు.
అమరావతి కాంట్రాక్టులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల పేరుతో కమీషన్ గా తీసుకున్న 118 కోట్ల లెక్క చూపని ధనం గురించి ఏం సమాధానం చెబుతారంటూ ఎంపీ ప్రశ్నించారు.
Also Read : Gudivada Amarnath : బాబు శేష జీవితం జైలు లోనే