Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
Tirumala Rush : తిరుమల- కలియుగ దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కోట్లాది మంది భక్తులు భావించే శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలు కొలువు తీరిన తిరుమల భక్తులతో నిండి పోయింది. ఎక్కడ చూసినా పుణ్య క్షేత్రం భక్తులతో నిండి పోయింది. శ్రీ స్వామి వారికి ప్రీతిపాత్రమైన రోజు శనివారం తో పాటు సెలవు రోజు ఆదివారం కావడంతో భక్తులు దర్శనం కోసం పోటెత్తారు.
Tirumala Rush with Devotees
తిరుమల గిరులన్నీ భక్తుల తాకిడితో హోరెత్తింది. నిన్న 81 వేల 459 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారికి 32 వేల 899 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇక భక్తులు నిత్యం సమర్పించే కానుకలు, విరాళాలు రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. రూ. 4.05 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తెలిపింది.
తిరుమలలోని 26 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి టోకెన్లు లేకుండా సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం దర్శనం అయ్యేందుకు కనీసం 24 గంటలకు పైగా పడుతుందని స్పష్టం చేసింది టీటీడీ.
ఇదిలా ఉండగా భక్తులకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయనే దానిపై స్వయంగా రంగంలోకి దిగారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సామాన్యులకు త్వరిత గతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read : Pragyan Rover Vikram Lander : జాబిలిపై ల్యాండర్..రోవర్ ఫోకస్