Tirumala : తిరుమలలో విశేష పర్వదినాలు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం
Tirumala : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో ఈ నెల సెప్టెంబర్ లో జరిగే విశేష పర్వదినాల ఏర్పాట్ల గురించి వెల్లడించింది. కలియుగ వైకుంఠంగా , పవిత్ర పుణ్య క్షేత్రంగా ఈ స్థలాన్ని కోట్లాది మంది భక్తులు భావిస్తారు.
Tirumala Updates
ఇందుకు సంబంధించి భక్తులకు సౌకర్యంగా ఉండేలా తిరుమలలో జరిగే విశిష్టమైన కార్యక్రమాలు, పూజల నిర్వహణ గురించి తెలియ చేసింది టీటీడీ. సెప్టెంబర్ 7న గోకులాష్టమి జరుగుతుందని పేర్కొంది. 8న ఉట్ల ఉత్సవం, 17న బలరామ జయంతి, వరాహ జయంతి, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
సెప్టెంబర్ 18న వినాయక చవితి, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 22న శ్రీవారి గరుడ సేవ జరుగుతుందని, 23న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 25న రథోత్సవం , 26న శ్రీవారి చక్రస్నానం, ధ్వజావరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగస్తాయని టీటీడీ(TTD) తెలిపింది.
సెప్టెంబర్ 27న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం జరుగుతుందని, 28న అనంత పద్మనాభ వ్రతం ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. భక్తులు పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరింది.
Also Read : Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు