Anurag Thakur : సనాతన ధర్మం శాశ్వతం – ఠాకూర్
ఉదయనిధి స్టాలిన్ కు కేంద్ర మంత్రి కౌంటర్
Anurag Thakur : న్యూఢిల్లీ – కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిప్పులు చెరిగారు. ఆయన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ పై భగ్గుమన్నారు. ప్రపంచంలో సనాతన ధర్మం అత్యంత ప్రాచీనమైదని పేర్కొన్నారు. భారత దేశ చరిత్ర సనాతన ధర్మంతో కూడుకుని ఉన్నదని స్పష్టం చేశారు. సోమవారం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు.
Anurag Thakur Comments on Udhayanidhi Stalin
సనాతన ధర్మాన్ని అణిచి వేయాలని కోరుకున్న వారు చరిత్రలో నామ రూపాలు లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. తమతో ఎవరు పెట్టుకున్నా మాడి మసై పోవాల్సిందేనంటూ హెచ్చరించారు. చరిత్ర తెలుసు కోకుండా నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు కేంద్ర మంత్రి.
హిందూవులను, ధర్మాన్ని నిర్మూలించాలని కోరుకునే వాళ్ల ఆటలు ఇక సాగవన్నారు. సనాతన ధర్మం ఈ భూమి మీద సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఉంటుందన్నారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). ఇది శాశ్వతంగా ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తనయుడు మంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అనేది డెంగ్యూ, మలేరియా వ్యాధి లాంటిదని పేర్కొన్నారు. దానిని వ్యతిరేకించ కూడదని, కానీ సమూలంగా నిర్మూలించేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు.
Also Read : Revanth Reddy : త్వరలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన