PM Modi : భారత దేశం అత్యంత కీలకం – మోదీ
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీఎం
PM Modi : న్యూఢిల్లీ – ప్రస్తుత ప్రపంచంలో భారత దేశం అత్యంత కీలకమైన దేశంగా మారబోతోందని స్పష్టం చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన జాతీయ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని రంగాలలో భారత్ ను ముందంజలో నెలకొల్పేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. తాను పీఎంగా కొలువు తీరాక ఎన్నో సవాళ్లు ముందున్నాయని, వాటిని దాటుకుంటూ వచ్చానని చెప్పారు నరేంద్ర మోదీ.
PM Modi Words about Development
భారత దేశం జీ20 ప్రెసిడెన్సీకి ప్రాతినిధ్యం వహిస్తోందని చెప్పారు. స్థిరమైన, సమానమైన ప్రపంచాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. మానవ కేంద్రీకృత విధానం, మహమ్మారి పట్ల ప్రతిస్పందన , సానుకూల ప్రభావాలను హైలెట్ చేశారు మోదీ.
మారుతున్న గ్లోబల్ ఆర్డర్ , ఆఫ్రికన్ యూనియన్ ను జీ20లో చేర్చాలని తాము ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు ప్రధాన మంత్రి(PM Modi). రాబోయే కాలంలో భారత దేశం అత్యంత కీలకమైన దేశంగా మారనుందని పేర్కొన్నారు. ప్రపంచమంతా కరోనా తాకిడికి తల్లడిల్లిన సమయంలో భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు మోదీ.
భారత దేశం కరోనా మహ్మమారిని సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు. అంతే కాదు భారత దేశం తీసుకు వచ్చిన మానవ కేంద్రీకృత అభివృద్ది నమూనాను ప్రపంచం ఇప్పటికే గుర్తించిందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి.
Also Read : Arvind Kejriwal : దేశానికి ఏది ముఖ్యం – కేజ్రీవాల్