Udhayanidhi Stalin : నా కామెంట్స్ కు కట్టుబడి ఉన్నా
ఎన్ని కేసులైనా ఎదుర్కొంటా
Udhayanidhi Stalin : చెన్నై – తమిళనాడు రాష్ట్ర యువజన శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి కుండ బద్దలు కొట్టారు. ఎవరో చెబితే తాను భయపడే వ్యక్తిని కానని అన్నారు.
Udhayanidhi Stalin Comment
తాను సనాతన ధర్మాన్ని మాత్రమే విమర్శించానని, దానిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని మరోసారి చెబుతున్నానని స్పష్టం చేశారు. ప్రతి క్షణం చెబుతూనే ఉంటానని ప్రకటించారు. నేను మారణ హోమాన్ని సహించే ప్రసక్తి లేదన్నారు. ఇవాళ చిన్నారులు సైతం విద్వేష పూరిత ప్రకటనలు చేస్తున్నారని వాపోయారు.
మరికొందరు ద్రవిడాన్ని రద్దు చేయాలని అంటున్నారని, అంటే డీఎంకే వాళ్లను చంపాలా అని నిలదీశారు ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin). కాంగ్రెస్ ముక్త్ భారత్ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇస్తున్నారంటే అర్థం కాంగ్రెస్ వాళ్లను చంపాలా అని మండిపడ్డారు.
సనాతన అంటే ఏమిటి..ఏదీ మారకూడదు. అన్నీ శాశ్వతమని అర్థం. కానీ ద్రవిడ ఇజం మోడల్ మార్పు కోసం పిలుపు ఇస్తుందన్నారు. అందరూ సమానంగా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు ఉదయనిధి స్టాలిన్. అయితే తాను అన్న మాటలను వక్రీకరించారని ఆరోపించారు.
తప్పుడు వార్తలను ప్రచారం చేయడంలో బీజేపీ ముందంజలో ఉంటుందన్నారు. వాళ్లు నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
Also Read : Daggubati Purandeswari : స్టాలిన్ కామెంట్స్ బాధాకరం