YS Vivekananda Reddy Case : ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రికి షాక్
బెయిల్ పిటిషన్ తిరస్కరణ
YS Vivekananda Reddy Case : హైదరాబాద్ – ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ముందస్తు పిటిషన్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై కోర్టు విచారించింది. ఇదిలా ఉండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాయన, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి స్వయాన తమ్ముడైన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా చంపారు.
YS Vivekananda Reddy Case Viral
ఈ దారుణ హత్య కేసులో కీలకమైన నిందితులుగా ఉన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నాయి. ఇప్పటికే భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.
తనకు ఆరోగ్యం బాగో లేదని, వెంటనే చికిత్స నిమిత్తం బయటకు పంపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు భాస్కర్ రెడ్డి. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ చెరసాలలో ఉన్నారు. బెయిల్ పిటిషన్ ను పూర్తిగా కొట్టి వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.
కాగా తమను కావాలని ఇరికించారంటూ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. తనకు మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy Case) హత్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ మొత్తం హత్య వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది.
Also Read : Udhayanidhi Stalin : నా కామెంట్స్ కు కట్టుబడి ఉన్నా