PM Modi : గురువులకు నమస్కారం – మోదీ
దేశ నిర్మాణం మీ చేతుల్లోనే
PM Modi : ఇవాళ దేశ వ్యాప్తంగా టీచర్స్ డే జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న గురువులకు నమస్కరిస్తున్నానని తెలిపారు మోదీ.
PM Modi Wushes to All Teachers
మంగళవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రధానమంత్రి(PM Modi ). మన భవిష్యత్తును నిర్మించడంలో , కలలను ప్రేరేపించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. వారి అచంచలమైన అంకితభావం, గొప్ప ప్రభావాన్ని కలుగ చేస్తున్నందుకు, ఈ ప్రయాణంలో అలుపెరుగని రీతిలో కృషి చేస్తున్నందుకు దేశంలోని ప్రతి ఉపాధ్యాయుడిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు నరేంద్ర మోదీ.
ప్రతి ఏటా తొలి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన టీచర్ గా పని చేస్తూ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవి వరకు చేరుకున్నారు.
ప్రధాన మంత్రి తన జీవిత కాలంలో తనకు పాఠాలు చెప్పిన వారిని గుర్తు చేసుకున్నారు. అంతే కాదు తాను టీచర్లతో , అధ్యాపకులతో కలిసిన కలిసిన క్షణాలను పంచుకున్నారు ప్రధాన మంత్రి.
Also Read : Delhi LG CM : ఢిల్లీలో 400 ఎలక్ట్రిక్ బస్సులు స్టార్ట్