Chinnajeeyar Swamy : తెలంగాణలో పాలకులకు భక్తి ఎక్కువ
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజీ
Chinnajeeyar Swamy : జగద్గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామీజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పాలకులకు దైవం అన్నా, భక్తి అన్నా ప్రేమ, నమ్మకం ఎక్కువ అన్నారు. అందుకే రాష్ట్రం సుభిక్షంగా ఉందని కొనియాడారు.
Chinnajeeyar Swamy Praises to KCR
పరిపాలన చేసే వారికి శ్రద్ద ఉంటే ప్రజానీకానికి ఇబ్బందులు అంటూ ఉండవన్నారు. రాష్ట్రంలో వానలకు, పంటలకు కొదువ లేకుండా పోయిందన్నారు. పాలకుడైన కేసీఆర్ భక్తుడు కావడం కూడా అదనపు బలంగా చేకూరిందన్నారు.
జనగాం జిల్లాలో వాల్మిడి శ్రీ సీతారామాంజనేయ స్వామి పునః ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సభను ఉద్దేశించి శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి(Chinnajeeyar Swamy) సందేశం ఇచ్చారు.
ఇదిలా ఉండగా గత కొన్ని నెలలుగా స్వామీజీకి సీఎం కేసీఆర్ కు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. రామానుజుల వారి విగ్రహం ఏర్పాటు సందర్భంగా కొంత ఇబ్బంది ఏర్పడింది. తాజాగా ఏమైందో ఏమో కానీ మరోసారి స్వామి వారు లైమ్ లైట్ లోకి వచ్చారు.
ఆ మధ్యన సమ్మక్క, సారలమ్మ గురించి వివాదాస్పద వ్యాఖ్యలకు తెర లేపారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి. ఆయన చేసిన కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే సీతక్క.
Also Read : PM Modi : గురువులకు నమస్కారం – మోదీ