Gangula Kamalakar : మంత్రి గంగులకు ఈడీ షాక్
కుటుంబీకులకు నోటీసులు
Gangula Kamalakar : బీఆర్ఎస్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నోటీసులు జారీ చేసింది. మంత్రి గంగులకు చెందిన శ్వేతా గ్రానైట్సస్ కంపెనీ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు గుర్తించింది.
Gangula Kamalakar Got Notices from ED
తమ దర్యాప్తులో 7.6 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను అక్రమంగా చైనాకు తరలించారని స్పష్టం చేసింది. ఇందులో ఏకంగా రూ. 74.8 కోట్ల మేర హవాలా మార్గంలో లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని సంచలన ఆరోపణలు చేసింది ఈడీ.
ఆయన అక్రమంగా గ్రానైట్ ను తరలిస్తున్నారంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. ఆయన దుబాయ్ కు వెళ్లిన సమయంలో మంత్రి నివాసంపై, ఆయనకు సంబంధించిన కుటుంబీకుల ఇళ్లపై దాడులు చేపట్టింది. అప్పట్లో అది సంచలనం కలిగించింది.
దీనిపై పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar). తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తమ కంపెనీ అన్ని అనుమతులకు లోబడే పనులు చేపడుతోందని చెప్పారు. ఈ తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇవాళ సంచలన ప్రకటన చేసింది. దీనికి ఏం సమాధానం మంత్రి చెబుతారనేది వేచి చూడాల్సి ఉంది.
Also Read : Chinnajeeyar Swamy : తెలంగాణలో పాలకులకు భక్తి ఎక్కువ