BJP Tickets : బీజేపీలో పోటా పోటీగా ద‌ర‌ఖాస్తులు

అప్లై చేసేందుకు ఎలాంటి రుసుము లేదు

BJP Tickets : హైద‌రాబాద్ – త్వ‌ర‌లో తెలంగాణ‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్ అభ్య‌ర్థుల జాబితాను డిక్లేర్ చేశాడు. మొత్తం 119 సీట్ల‌కు గాను 115 సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఇందులో 7 మందికి మొండి చేయి చూపించారు.

BJP Tickets Updates

దీంతో ప్ర‌తిప‌క్షాల‌పై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది. ముంద‌స్తుగా ప్ర‌తిప‌క్షాల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు కేసీఆర్. ఈ ఏడాదిలోనే ఎన్నిక‌లు జ‌రిపేందుకు ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. చాప కింద నీరులా ప్ర‌చారం ప్రారంభించారు కేసీఆర్.

మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ సైతం ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించింది. డెడ్ లైన్ కూడా ముగిసింది. ఆ పార్టీలో ఎన్న‌డూ లేని రీతిలో ఓసీల‌కు రూ.50,000 వేలు, బీసీల‌కు రూ. 25,000 వేల రూపాయ‌లు ద‌ర‌ఖాస్తు కింద వ‌సూలు చేసింది.

కాగా తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీలో(BJP) మాత్రం ఆ కండీష‌న్ పెట్ట‌లేదు. దీంతో ఎలాంటి ఫీజు లేక పోవ‌డంతో అభ్య‌ర్థులు పెద్ద ఎత్తున ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌లో పోటీ చేసేందుకు ఉత్సుక‌త చూపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 999కు పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చిన‌ట్లు ఆ పార్టీ ప్ర‌క‌టించింది.

ఇదిలా ఉండ‌గా ఈనెల 10న డెడ్ లైన్ విధించింది బీజేపీ శాఖ‌. ఇప్ప‌టికే ఆ పార్టీ చీఫ్ గా ఉన్న బండి సంజ‌య్ ను త‌ప్పించింది హైక‌మాండ్. ఆయ‌న స్థానంలో కిష‌న్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

Also Read : MS Dhoni Plays : ట్రంప్ తో గోల్ఫ్ ఆడిన ధోనీ

Leave A Reply

Your Email Id will not be published!