R Krishnaiah : హైదరాబాద్ – వైసీపీ రాజ్యసభ ఎంపీ , బీసీ సంక్షేమ సంఘం చీఫ్ ఆర్. కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉన్నట్టుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విస్తు పోయేలా చేసింది. ఓ వైపు రాష్ట్రంలో తీవ్ర సమస్యలతో ప్రజలు ఇబ్బందు పడుతుంటే కృష్ణయ్య మాత్రం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీని పొగడడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
R Krishnaiah Praises MLC Kavitha
శుక్రవారం ఆర్. కృష్ణయ్య(R Krishnaiah) మీడియాతో మాట్లాడారు. ఆయన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆకాశానికి ఎత్తేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఆమె పోరాటం చేస్తోందని అన్నారు. కవిత చేస్తున్న పోరాటం వల్ల కేంద్ర సర్కార్ లో కదలిక వచ్చిందని చెప్పారు. లేక పోతే ఈ అంశం చర్చకు వచ్చి ఉండేది కాదన్నారు.
అనేక పార్టీలకు చెందిన నాయకులు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రస్తావిస్తున్నారని ఈ క్రెడిట్ అంతా కల్వకుంట్ల కవితకు దక్కుతుందన్నారు. విచిత్రం ఏమిటంటే కవిత తాను చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా లేఖలు రాశారు.
దీనిపై తీవ్రంగా స్పందించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల. మహిళా రిజర్వేషన్ కోసం ప్రశ్నిస్తున్న కల్వకుంట్ల కవిత ముందు బీఆర్ఎస్ పార్టీలో, ప్రభుత్వం, ప్రకటించిన టికెట్లలో ఎంత మంది మహిళలకు ఛాన్స్ ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read : Rajasthan Royals : యార్క్ షైర్ కౌంటీకి ఆర్ఆర్ ఆఫర్