Kerala Glass Bridge : పొడవైన గాజు వంతెన ప్రారంభం
కేరళలో ఆకట్టుకుంటున్న వంతెన
Kerala Glass Bridge : కేరళ – కేరళ రాష్ట్రం చరిత్ర సృష్టించింది. దేశంలోనే అతి పెద్ద పొడవైన గాజు వంతెనను ఏర్పాటు చేసింది. ఇది పర్యాటకులను ఆకర్షిస్తోంది. కేరళలో విహారానికి వచ్చే పర్యాటకుల హృదయాలను ఆకట్టుకుంటోంది గాజు వంతెన.
ఈ గాజు వంతెన రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లా లోని వాగమన్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేసింది కేరళ సర్కార్. ఇది దేశంలోనే అతి పెద్ద పొడవైన గాజు వంతెన కావడం విశేషం.
Kerala Glass Bridge Viral
ఈ వంతెనపై ఏక కాలంలో 15 మంది నడిచేందుకు వీలుంటుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఈ గ్లాసు వంతెనను(Kerala Glass Bridge) రూ. 3 కోట్ల ఖర్చుతో నిర్మించారు. ఇదిలా ఉండగా ఈ గాజు వంతెనను చూడాలని అనుకున్నా లేదా దీనిపై నడవాలంటే ప్రవేశ రుసుము కూడా నిర్ణయించింది ప్రభుత్వం.
ఇందుకు సంబంధించి ఒక్కొక్కరికీ రూ. 500 రుసుముగా నిర్ణయించింది. సముద్ర మట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉంది ఈ గాజు వంతెన. 120 అడుగుల పొడవు ఉంది. కేరళ రాష్ట్రానికి చెందిన పర్యాటక శాఖ మంత్రి రియాస్ వాగమోన్ లో నిర్మించిన అతి పెద్ద కాంటిలివర్ గాజు వంతెనను ప్రారంభించారు.
Also Read : Chandrababu Naidu : చంద్రబాబు కామెంట్స్ కలకలం