BUS Fire : డ్రైవర్ అప్రమత్తం తప్పిన ప్రమాదం
కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
BUS Fire : నల్లగొండ – నల్లగొండ జిల్లాలో శుక్రవారం బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మిర్యాలగూడలో చోటు చేసుకుంది. బస్సు డ్రైవర్ ముందు జాగ్రత్తగా మేలు కోవడంతో భారీ ఎత్తున ప్రమాదం నుండి బయట పడ్డారు ప్రయాణీకులు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
BUS Fire in Nalgonda
వివరాలకు సంబంధించి చూస్తే..కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్లేందుకు బయలు దేరింది. విజయవాడ రూట్ మీదుగా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ వద్దకు చేరుకుంది ఈ బస్సు.
ఉన్నట్టుండి బస్సులో మంటలు(BUS Fire) చెలరేగాయి. దీంతో వెంటనే బస్సు డ్రైవర్ బస్సును నిలిపి వేశాడు. ఆ వెంటనే బస్సులో ప్రయాణం చేస్తున్న 26 మంది ప్రయాణీకులను హుటా హుటిన దించి వేశాడు. దీంతో పెను ప్రమాదం నుంచి బయట పడ్డారు .
ఈ ఘోర ప్రమాదం నుండి బతికి బయట పడ్డారు ప్రయాణం చేస్తున్నవారు. డ్రైవర్ అప్రమత్తం కాక పోయి ఉంటే బస్సులోనే ఇరుక్కు పోయే వారు. మాడి మసై పోయే వారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు పూర్తిగా కాలి పోయింది. చూస్తూ ఉండగానే పూర్తిగా బస్సు దగ్దం కావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. మొత్తంగా ప్రమాదం నుంచి బయట పడడంతో డ్రైవర్ కు థ్యాంక్స్ తెలిపారు.
Also Read : Minister KTR : రూ. 50 లక్షల బెడ్ రూమ్ పేదలకు ఫ్రీ