RS Praveen Kumar : హోం గార్డులు ఆత్మహత్యలు చేసుకోవద్దు
బీఎస్పీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం స్పందించారు. పోలీసు శాఖలో 17 ఏళ్లుగా హోం గార్డుగా విధులు నిర్వహించిన రవీందర్ పెట్రోల్ పోసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
RS Praveen Kumar Comments Viral
మృత్యువుతో పోరాడుతూ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. అతడిని ఆస్పత్రిలో పరామర్శించి వచ్చానని అంతలోపే రవీందర్ లేడన్న వార్త తనను కలిచి వేసిందని వాపోయాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar).
ఆయన మృతికి సంతాపం తెలియ చేస్తున్నానని పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్ హోం గార్డులను పర్మినెంట్ చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ మాయ మాటలతో కాలం వెళ్లబుచ్చారని ఆవేదన చెందారు ఆర్ఎస్పీ.
ఒక వేళ సీఎం ఇచ్చిన హామీ అమలు అయి ఉంటే ఇవాళ హోం గార్డు రవీందర్ చని పోయి ఉండేవాడు కాదని పేర్కొన్నారు. నియంత పాలకులకు హోం గార్డుల కష్టాలు, కన్నీళ్లు పట్టవని ఆరోపించారు. తక్షణమే రూ. 50 లక్షలు ఆర్థిక సాయం చేయాలని, మృతుని కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్పీ.
Also Read : Ambati Rambabu : హలో ‘బ్రో’ ఏమై పోయావ్