Pawan Kalyan : బాబు అరెస్ట్ ను ఖండిస్తున్నా
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
Pawan Kalyan : హైదరాబాద్ – జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయన అరెస్ట్ ను ఖండిస్తున్నానని చెప్పారు.
Pawan Kalyan Comments on Chandrababu’s Arrest
జైలుకు పోయిన వాళ్లు దర్జాగా విదేశాలకు వెళ్ల వచ్చని, ప్రజల తరపున ప్రశ్నించే నాయకుడు చంద్రబాబు నాయుడును ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. అర్ధరాత్రి పూట ఎలాంటి సమాచారం లేకుండా అదుపులోకి ఎలా తీసుకుంటారంటూ నిలదీశారు పవన్ కళ్యాణ్.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సింది పోలీసులని, కానీ వైసీపీ మంత్రులే పోలీసుల తరపున మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయిందన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా చంద్రబాబు నాయుడు వద్దకు వెళతారంటూ మండిపడ్డారు. తమ నాయకుడి తరపున పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు మద్దతు తెలపడం, ఆందోళనలు, నిరసనలకు దిగడం మామూలేనన్నారు.
వైసీపీకి ఒక న్యాయం , ప్రతిపక్షాలకు వేరే న్యాయం ఎలా ఉంటుందుని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడికి బేషరతు మద్దతు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు.
Also Read : Gudivada Amarnath : చంద్రబాబుకు జైలు శిక్ష తప్పదు