Siddharth Luthra : బాబు తరపు వాదిస్తున్న లూత్రా
అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ
Siddharth Luthra : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీమ్ స్కామ్ కేసులో రూ.550 కోట్లు చేతులు మారాయంటూ ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో నంద్యాలలో శనివారం టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడును అదుపులోకి తీసుకున్నారు. ఆయనను విజయవాడకు తరలించారు.
Siddharth Luthra Arguing Chandrababu Case
ఈ సందర్బంగా చంద్రబాబుకు బెయిలా లేక జెయిలా అనేది తేల్చేందుకు వాదించేందుకు ఢిల్లీ నుంచి విచ్చేశారు సిద్దార్థ్ లూత్రా(Siddharth Luthra). ఆయన దేశంలో ప్రముఖ లాయర్ గా గుర్తింపు పొందారు. ఫిబ్రవరి 16, 1966 న పుట్టారు. సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ గా పని చేశారు.
ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టం, విధాన సమస్యలకు సంబంధించిన విషయాలలో యూనియన్ , వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించాడు. మే 2014లో తన పదవికి రాజీనామా చేశాడు.
సిద్దార్థ్ లూథ్రా క్రిమినల్ లా, వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలకు సంబంధించిన కేసులలో ప్రావీణ్యం కలిగి ఉన్నారు. ఢిల్లీలో లా చేశాడు. 1991లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో ఎంఎఫిల్ చేశాడు. అమిటీ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ అందజేశారు.
Also Read : Chandrababu Skill Scam Comment : బాబు స్కిల్ స్కామ్ కథేంటి