Chandrababu Naidu : బాబు అరెస్ట్ సిట్ విచారణ
నీళ్లు నమిలిన టీడీపీ చీఫ్
Chandrababu Naidu : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును శనివారం ఉదయం నంద్యాలలో అరెస్ట్ చేశారు. ఆయనను రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుండి విజయవాడకు తరలించారు. దారి పొడవునా టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల జోక్యంతో వారిని చెల్లా చెదురు చేశారు.
Chandrababu Naidu Case SIT Enquiry
తాడేపల్లి గూడెంలోని కంచనపల్లి సిట్ ఆఫీసుకు నారా చంద్రబాబు నాయుడును తరలించారు భారీ భద్రత మధ్య. ఈ సందర్బంగా చంద్రబాబుకు 20 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని అందజేశారు. ఏ ప్రశ్నకు చంద్రబాబు(Chandrababu Naidu) సరైన సమాధానం ఇవ్వడం లేదని సమాచారం.
విచారణ జరుగుతున్న సందర్భంగా 200 మందికి పైగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక బాబు తరపున వాదించేందుకు ఢిల్లీ నుంచి పేరు పొందిన ప్రముఖ న్యాయవాది సిద్దార్థ్ లూథర్ వాదించేందుకు వచ్చారు. ఇవాళ, రేపు సెలవులు ఉండడంతో సిట్ ఆధ్వర్యంలో విచారణ పూర్తయిన తర్వాత కోర్టుకు తరలించే ఛాన్స్ ఉంది.
ఇదిలా ఉండగా అంతకు ముందు ఏపీ సీఐడీ చీఫ్ ఎన్.సంజయ్ మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించారు. రూ. 550 కోట్ల స్కాం చోటు చేసుకుందని తెలిపారు. ఈ మొత్తం స్కాంకు ప్రధాన సూత్ర ధారి , పాత్రధారి నారా చంద్రబాబు నాయుడని స్పష్టం చేశారు. బాబును కలిసేందుకు ప్రయత్నించిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం భార్య భువనేశ్వరి , కొడుకు లోకేష్ కు మాత్రమే అనుమతి ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ టీడీపీ ఆదివారం బంద్ కు పిలుపునిచ్చింది.
Also Read : Siddharth Luthra : బాబు తరపు వాదిస్తున్న లూత్రా