Chandrababu Naidu Lokesh : స్కిల్ స్కామ్ లో తండ్రీ..కొడుకు
ఏపీ సీఐడీ సంచలన ప్రకటన
Chandrababu Naidu Lokesh : విజయవాడ – ఏపీ సీఐడీ సంచలన ప్రకటన చేసింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ లో కీలకమైన పాత్రధారులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు అని ప్రకటించింది. మొత్తం ఈ స్కామ్ కేసుకు సంబంధించి 25 పేజీల రిమాండ్ రిపోర్టు తయారు చేసింది.
Chandrababu Naidu Lokesh Viral
దీనిని తాజాగా ఏసీబీ కోర్టు జడ్జికి సమర్పించింది. ఇరు తరపు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ చీఫ్ ఎన్. సంజయ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాలను ఆధారాలతో సహా రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నాయని తెలిపారు.
కిలారు రాజేష్ ద్వారా నారా లోకేష్ కు డబ్బులు అందాయన్నారు. ఇక పీఏ శ్రీనివాస్ ద్వారా నారా చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) ముడుపులు సమకూరాయని పేర్కొన్నారు. ఈ స్కామ్ పై విచారణ జరుపుతున్నామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేశామన్నారు.
కేసులో మనోజ్ వాసుదేవ్ , పెండ్యాల శ్రీనివాస్ కు సెప్టెంబర్ 5న నోటీసులు అందజేశామన్నారు సీఐడీ చీఫ్ సంజయ్. తాము జారీ చేసిన నోటీసులకు జవాబు ఇవ్వకుండా విదేశాలకు పారి పోయారని చెప్పారు. వీళ్లను చంద్రబాబే కాపాడుతున్నాడని తమ అనుమానం అని తెలిపారు.
Also Read : Pawan Kalyan : జగన్ ఓ క్రిమినల్ – పవన్