Chandrababu Naidu Jail : చంద్రబాబుకు రాజమండ్రి జైలేనా..?
ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు
Chandrababu Naidu Jail : విజయవాడ – ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కీం స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. రూ. 550 కోట్లు చేతులు మారాయని ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసింది. జడ్జి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
Chandrababu Naidu Jail Viral
ఇరు పక్షాల తరపున వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ సుధాకర్ రెడ్డి వాదించారు. ఇక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు తరపున వెంకటేశ్వర్ రావు, సిద్దార్థ్ లూథ్రా వాదించారు.
అంతకు ముందు 10 గంటలకు పైగా ఏపీ సీఐడీ కంచనపల్లి ఆఫీసులో విచారించింది. ఈ సందర్భంగా ఎలాంటి సరైన సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. చంద్రబాబు నాయుడు ముందు 20 ప్రశ్నలు ముందుంచింది.
అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు బాబును. పరీక్షలు చేపట్టిన అనంతరం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. స్వయంగా తనకు కూడా వాదనలు వినిపించే ఛాన్స్ ఇవ్వాలని జడ్జిని కోరారు. న్యాయమూర్తి ఇందుకు పర్మిషన్ ఇచ్చారు.
ఒకవేళ చంద్రబాబును కోర్టు రిమాండ్ కు పంపితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు వెళ్లే రహదారి పొడవునా వాహనాలు లేకుండా చూస్తున్నారు పోలీసులు.
Also Read : Chandrababu Naidu Lokesh : స్కిల్ స్కామ్ లో తండ్రీ..కొడుకు