Tirumala Rush : తిరుమ‌ల‌కు పోటెత్తిన భ‌క్త‌జ‌నం

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.47 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – పుణ్య క్షేత్రం తిరుమ‌ల‌కు భ‌క్తుల‌కు పోటెత్తారు. ఎక్క‌డ చూసినా భ‌క్తుల‌తో నిండి పోయింది. గోవిందా గోవిందా, శ్రీ‌నివాసా గోవిందా, ఆప‌ద మొక్కుల వాడా గోవిందా, అనాధ ర‌క్ష‌క గోవిందా , అదివో అల్ల‌దివో శ్రీ‌హ‌రి వాస‌ము, ప‌ది వేల శేషుల ప‌డ‌గ‌ల మ‌యం అంటూ భ‌క్తులు స్మ‌రించారు.

Tirumala Rush with Devotees

నిన్న సెల‌వు రోజు ఆదివారం కావ‌డంతో తిరుమ‌ల‌లో కొలువైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. ఊహించ‌ని రీతిలో భారీ ఎత్తున భ‌క్తులు తిరుమ‌లకు చేరుకున్నారు. రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.

నిన్న ఒక్క రోజు భ‌క్తుల సంఖ్య భారీ ఎత్తున పెర‌గ‌డం విశేషం. 84 వేల 449 మంది భ‌క్తులు శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. 33 వేల 570 మంది భ‌క్తులు త‌ల నీలాలు స‌మ‌ర్పించారు. భ‌క్తులు నిత్యం స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా స‌మ‌ర్పించే శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 4.47 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది.

తిరుమ‌ల లోని 22 కంపార్ట్మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. ఎలాంటి ఎస్ఎస్డీ టోకేన్లు లేని భ‌క్తుల‌కు క‌నీసం 18 గంట‌ల‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని ద‌ర్శ‌నం చేసుకునేందుకు.

Also Read : Etela Jamuna : గ‌జ్వేల్ బ‌రిలో ఈటెల జ‌మున

Leave A Reply

Your Email Id will not be published!