RK Roja Selvamani : తిరుపతి – టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. నిన్నటి దాకా వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ వచ్చిన బాబుకు ఇప్పుడు అడ్డంగా దొరికి పోయారని అన్నారు.
RK Roja Selvamani Comments Viral
తిరుపతిలో ఏపీ మంత్రి ఆర్కే రోజా(RK Roja Selvamani) మీడియాతో మాట్లాడారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిందని అన్నారు. చంద్రబాబు నాయుడుకు వేరే చట్టం అంటూ ఉండదన్నారు. దేశంలోని బోగస్ కంపెనీలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
టీడీపీ చీఫ్ దేశంలోనే అతి పెద్ద ఆర్థిక ఉగ్రవాది అన్నారు ఆర్కే రోజా. చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యం కాదన్నారు. సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయాడని అన్నారు. ఇప్పుడు చేసేది ఏమీ లేదన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి లాయర్లను తీసుకు వచ్చినా న్యాయాన్ని సమాధి చేయలేరని అన్నారు ఆర్కే రోజా.
అవినీతిలో చంద్రబాబు నాయుడు అతి పెద్ద అనకొండ అంటూ మండిపడ్డారు. కక్ష సాధించాలనే ఆలోచన తమ సీఎం జగన్ రెడ్డికి లేదన్నారు ఏపీ మంత్రి. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామికంగా జరిగిందన్నారు.
Also Read : Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తజనం