Sajjala Ramakrishna Reddy : తప్పు చేయక పోతే నిరూపించుకో
సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్
Sajjala Ramakrishna Reddy : తాడేపల్లిగూడెం – అవినీతి, అక్రమాలకు పాల్పడడమే కాకుండా రాష్ట్ర బంద్ కు పిలుపు ఇవ్వడం దేని కోసమని ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy). సోమవారం మీడియాతో మాట్లాడారు. గతంలో కూడా మాజీ సీఎంలు, ప్రధానులు కూడా కేసులు ఎదుర్కొన్నారని అన్నారు. చంద్రబాబు నాయుడుకు శిక్ష తప్పదన్నారు.
Sajjala Ramakrishna Reddy Comments about Bandh
ఒకవేళ తప్పు చేయక పోయి ఉంటే కోర్టులో తేల్చు కోవాలన్నారు. నువ్వు తప్పు చేసి తమపై బురద చల్లితే ఎలా అని ప్రశ్నించారు చంద్రబాబు నాయుడిని. ఎవరి కోసం ఎందు కోసం పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తున్నారో చెప్పాలన్నారు.
ఎవరైనా నీతి మంతులకు సపోర్ట్ చేస్తారని, కానీ పవన్ ఎందుకు వంత పాడుతున్నాడో స్పష్టం చేయాలన్నారు. ఆధారాలు ఉండడం వల్లనే కోర్టు తీర్పు చెప్పిందన్నారు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఆకాశం నుంచి ఊడి పడలేదన్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీకి గెస్ట్ లాగా వచ్చి వెళుతున్నాడని ఎద్దేవా చేశారు. కేసుల నుంచి చంద్రబాబు నాయుడు తప్పించు కోలేరన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి. కేసులకు రాజకీయాలకు లింకు ఏమిటని ప్రశ్నించారు . బాబు జైలు ఊచలు లెక్క పెట్టడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : DK Aruna : డీకే అరుణకు సుప్రీం షాక్